Ramayana: రామాయణ టైటిల్ పై ప్రశ్నలు

రామాయణంను రెండు భాగాలుగా బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితేష్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor) రాముడిగా, సాయి పల్లవి(Sai Pallavi) సీతగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ టైటిల్ పై చితలే గ్రూప్ యజమానుల్లో ఒకరైన నిఖిల్ చితలే(Nikhil Chithale) ఓ ప్రశ్నను లేవనెత్తారు. మూవీ టైటిల్ రామాయణ(Ramayana) అని కాకుండా రామాయణ్ అని పెట్టాలని ఆయన అన్నారు.
రామాయణ్, రామ్ లాంటి పదాలను ఆంగ్లీకరించడం మానేయాలని, వారసత్వానికి యాస అవసరం లేదని వాల్మీకీ రామాయణంలో రాశారని నిఖిల్ చితలే తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో నిఖిల్ చితలే ను కొందరు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు అతని అభిప్రాయాన్ని ఏకీభవించడం లేదు. అది ఆంగ్లీకరణ కాదని కొందరంటుంటే, సినిమాను హిందీలో తీస్తే హిందీ ఉచ్చారణతోనే టైటిల్ ను పెట్టాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమా నుంచి ఈ గురువారం పాత్రలను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్ రిలీజవగా, దానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రామాయణ మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్(AR Rahman), హాన్స్ జిమ్మర్(Hans Zimmer) సంగీతం అందిస్తున్నారు.