కేజీఎఫ్ మాదిరిగానే పుష్ప
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. డివైడ్ టాక్ ను తట్టుకుని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్ కూడా కలెక్షన్ల మోత మోగించి, పుష్ప రేంజ్ ను మార్చేసింది. పుష్ప సినిమా తర్వాత బన్నీ డైలాగ్స్, మేనరిజమ్స్ ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
దీంతో పుష్ప2 కు భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని సుకుమార్ ఈ స్క్రిప్ట్ పై మళ్లీ వర్క్ చేసి పుష్ప2ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చాలానే టైమ్ పట్టింది. షూటింగ్ కూడా అనుకున్నంత వేగంగా సాగట్లేదు. ఈ ఏడాది సెకండాఫ్ లో వస్తుందనుకున్న పుష్ప2 సినిమాను వచ్చే సమ్మర్‌కు పోస్ట్‌పోన్ చేశారు. అయితే వచ్చే సమ్మర్‌కు అయినా పుష్ప2 వస్తుందా రాదా అన్న సందేహాలు చాలా మందికి ఎక్కువయ్యాయి. ఇప్పటివరకు పుష్ప2 షూటింగ్ 40% మాత్రమే పూర్తయినట్లు తెలుస్తోంది. సుక్కు స్పీడుకు, పర్ఫెక్షన్కి వేసవికల్లా వివిధ భాషల్లో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలంటే పెద్ద రిస్కే అని భావిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం పుష్ప2 యూనిట్ ఈ సినిమా షెడ్యూల్స్ ను చాలా పక్కాగా ప్లాన్ చేస్తుందట. జనవరి నెలాఖరుకల్లా షూట్ మొత్తం పూర్తి చేసి, తర్వాత ఒక నెలన్నర లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయాలని చూస్తున్నారట. అంతేకాదు ఈ సినిమా కథను ఓ దగ్గర ముగించి, పార్ట్3 తీయడానికి ఛాన్స్ ఉండేలా ఓపెన్ ఎండింగ్ ఇవ్వనున్నాడట సుకుమార్. కేజీఎఫ్2 తరహాలోనే ఈ సినిమాకు కూడా ఓపెన్ ఎండింగ్ ను ప్లాన్ చేశారు. పుష్ప2 రిజల్ట్ ను బట్టి పుష్ప3 ఉంటుందా లేదా అని తర్వాత ఆలోచించనున్నారు.













