Puri Sethupathi: సేతుపతి కోసం భారీ సెట్
లైగర్(liger), డబుల్ ఇస్మార్ట్(Double ismart) డిజాస్టర్ల తర్వాత పూరీ జగన్నాథ్(Puri Jagannadh) ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టైమ్ లో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో సినిమాను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు పూరీ(Puri). ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ వినిపిస్తోంది.
సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన లాంగ్ షెడ్యూల్ కోసం మేకర్స్ ఓ భారీ సెట్ ను వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సెట్ లో క్లైమాక్స్ తో పాటూ విజయ్ సేతుపతిపై ఓ సోలో సాంగ్‌ను షూట్ చేస్తారని సమాచారం. ఈ మూవీలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ కు మూడు యాంగిల్స్ ఉంటాయని, అందులో ఒక యాంగిల్ లో ఆయన నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవన్నీ వింటుంటే పూరీ ఈసారి సేతుపతితో ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్టు అర్థమవుతుంది. పైగా సినిమా మొదలుపెట్టినప్పుడే విజయ్ సేతుపతి ఈ కథ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. టబు(Tabu), సంయుక్త మీనన్(Samyuktha Menon), దునియా విజయ్(Duniya Vijay) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను పూరీ కనెక్ట్స్(Puri Connects) బ్యానర్ లో పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్(Charmmee Kaur) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.







