Pooja Hegde: విజయ్ ను డామినేట్ చేసేసిన బుట్టబొమ్మ
మామూలుగా ఎప్పుడైనా పెద్ద హీరో నుంచి ఏదైనా సాంగ్ వస్తే అందులో ఎవరైనా సరే ఎక్కువగా చూసేది హీరోనే. కానీ ఇప్పుడు పూజా హెగ్డే(Pooja Hegde) ఆడియన్స్ చూపుల్ని హీరో వైపు నుంచి తన వైపుకు తిప్పుకుంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న జన నాయగన్(jana nayagan) మూవీ నుంచి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ గా దళపతి కచేరి(thalapathy kacheri) సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే.
ఆ సాంగ్ లో పూజా, విజయ్ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ డ్యాన్సులేయడమే కాకుండా చీరలో సాంప్రదాయంగా కనిపిస్తూనే మంచి లుక్స్, గ్రేస్‌ఫుల్ మూమెంట్స్ తో అందరినీ ఆకట్టుకుంది. దీంతో పూజా స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పుడు కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారడంతో పాటూ దళపతి కచేరి సక్సెస్ లో అధిక భాగం క్రెడిట్ ఆమె ఖాతాలోనే పడింది. సుమారు మూడేళ్ల గ్యాప్ తర్వాత పూజా కోలీవుడ్ లోకి కంబ్యాక్ ఇచ్చినప్పటికీ, ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్దగా సక్సెస్ అయింది లేదు.
రెట్రో(retro) మూవీ భారీ ఫ్లాపుగా నిలిచింది. అయినా రజినీకాంత్(rajinikanth) కూలీ(coolie)లో మోనికా(Monica) సాంగ్ చేసి దాన్ని చార్ట్‌బస్టర్ గా నిలపడంతో పాటూ దాంతో అందరినీ ఉర్రూతలూగించింది. ఇక రీసెంట్ గా దళపతి కచేరి సాంగ్ తో మరోసారి పూజా తన లుక్స్, డ్యాన్స్ మూమెంట్స్ తో అందరి దృష్టిని ఆకర్షించడంతో ఇదే పూజా అసలైన కంబ్యాక్ అని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులతో ట్రెండింగ్ చేస్తున్నారు.







