టెన్షన్లో ప్రభాస్ ప్రొడ్యూసర్లు
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వాలా అని తనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలందరూ తెగ టెన్షన్ పడుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు అంటే సంథింగ్ స్పెషల్ గా ఉండాలి. అలా ఉండాలంటే తామిచ్చే అప్డేట్స్ ఎంతో స్పెషల్ గా ఉండాలి. మరో పది రోజుల్లో రానున్న ప్రభాస్ బర్త్ డే పై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నింటి నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వాటిలో సలార్ ముఖ్యమైనది. సలార్ నుంచి ట్రైలర్ వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ బెంగుళూరు ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం సలార్ ట్రైలర్ రిలీజ్ కావడం డౌటే అని తెలుస్తోంది. ప్రస్తుతం సలార్ టీమ్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది.
అయినప్పటికీ ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేయాలనే ఆలోచనతో ప్రశాంత్ నీల్ రెండు మూడు వెర్షన్స్ రెడీ చేయిస్తున్నాడట. కానీ వాటిలో ఏదీ అతన్ని శాటిస్ఫై చేయలేదని టాక్. ది బెస్ట్ అవుట్ పుట్ తో ట్రైలర్ కట్ రెడీ అయితేనే సలార్ ట్రైలర్ ఉంటుంది తప్పించి, లేకపోతే ఉండే సమస్యే లేదని తేల్చేశాడట.
ట్రైలర్ కు బదులు సలార్ నుంచి ఏదైనా లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేసి అయినా ఆ లోటును భర్తీ చేయాలని ఆలోచిస్తున్నారట. ఇక కల్కి నుంచి ఎలాగూ పోస్టర్ లేదా టీజర్ రిలీజ్ అయ్యే ఛాన్సుంది. మారుతి మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ ఉండకపోవచ్చంటున్నారు. వేరే సినిమా అప్డేట్స్ ఇస్తే సలార్ హైప్ డీవియేట్ అవుతుందని, అలా కాకుండా చూసుకోవాలని ప్రభాస్ ముందే ఇతర ప్రొడ్యూసర్లకు కూడా చెప్పడంతో అందరూ సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. ఇన్ని ఆబ్లిగేషన్ల నడుమ ఫ్యాన్స్ కు ప్రభాస్ ఎలాంటి బర్త్ డే ట్రీట్ ఇస్తాడో చూడాలి.













