పూజా హెగ్డే తప్పుకోడానికి కారణం ఇదే!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ సినిమాను ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ మొదటి నుంచి ఏదొక సమస్య సినిమాను వెంటాడుతూనే ఉంది. ఇందులో భాగంగానే మొదట హీరోయిన్ మార్పు, ఆ తరువాత సంగీత దర్శకుడు కూడా మార్చారని కూడా ప్రచారమైంది.
ఈ సినిమాలో మొదట పూజా హెగ్డే ని హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. కానీ పూజా కొన్ని కారణాల ఆమె వల్ల తప్పుకోడంతో, ఆ స్థానంలో శ్రీలీల వచ్చింది. శ్రీలీల ప్లేస్ లోకి సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి వచ్చింది. ఇదిలా ఉంటే అసలు పూజా సినిమా నుండి తప్పుకోవడం గురించి మీడియాలో ఎందుకింత చర్చలు జరిగాయో నిర్మాత నాగవంశీ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
పూజాకి తన సినిమా కాల్షీట్లు ఖాళీ లేకపోవడమే దానికి కారణం అని వంశీ వెల్లడించారు. అనుకున్న దాని ప్రకారం షూటింగ్ స్టార్ట్ చేయకపోవడంతో పూజాకు డేట్స్ క్లాష్ అయ్యాయి. ఆమెకు వేరే హిందీ సినిమా కమిట్ మెంట్ ఉండటంతో, దానిని బ్యాలెన్స్ చేయలేక గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే తప్పుకుందని నాగవంశీ చెప్పుకొచ్చారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కి సిద్ధం అవుతున్నది. సినిమా టాకీ పార్ట్ ను అక్టోబర్ నాటికి పూర్తి చేసి, సాంగ్స్ ను డిసెంబర్ వరకు పూర్తి చేయాలని ప్రణాళికలు రెడీ చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను ఇవ్వనున్నట్లు వంశీ వెల్లడించాడు. థమన్ సంగీతం అందిస్తున్న సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.













