Ustaad Bhagath Singh: పవన్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా వచ్చిన ఓజి(OG) సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుందో తెలిసిందే. ఎంతో కాలంగా పవన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సక్సెస్ ఓజి రూపంలో వారికి వచ్చింది. ఓజి సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న ఫ్యాన్స్ దృష్టి ఇప్పుడు ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad Bhagath Singh) పైకి మళ్లింది. పవన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్.
హరీష్ శంకర్(Harish Sankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి. దానికి కారణం ఆల్రెడీ వీరిద్దరి కలయికలో గతంలో గబ్బర్ సింగ్(Gabbar Singh) మూవీ రాగా, ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ మూవీ రానుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై మంచి హైప్ నెలకొంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను నిర్మాత వెల్లడించారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్(ravi shankar) రీసెంట్ గా డ్యూడ్(Dude) మూవీ ప్రెస్ మీట్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మాట్లాడారు. ఆల్రెడీ ఈ సినిమాలో పవన్ పోర్షన్ కు సంబంధించిన షూటింగ్ పూర్తైందని చెప్పారు. ఇవాళ నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ కూడా మొదలవుతున్నట్టు ఆయన చెప్పారు. మరో 20-25 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని, షూటింగ్ పూర్తయ్యాక రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తామని చెప్పారు.