ఐటెమ్ సాంగ్ లో ప్రియాంక చోప్రా?
జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం అరవింద సమేత. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరింది. ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతోన్న సినిమాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే అరవింద సమేతలో ఓ స్పెషల్ అప్పియరెన్స్ ఉందట. అదే ఐటెమ్ సాంగ్. అందుకు బాలీవుడ్ భామను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారట. అమె ఎవరంటే ప్రస్తుత హాలీవుడ్లో సంచలనం రేపుతోన్న బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా అంటున్నారు. బాలీవుడ్ చిత్రాలకే టైం ఇవ్వలేనంతా బిజీగా వున్న ప్రియాంక, తెలుగు సినిమాకు టైమిస్తుందా? అన్న సందేహం కలగొచ్చు. కానీ, ప్రయత్నాలైతే జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు హీరోయిన్లలో ఐటెం సాంగ్ చేయిస్తే రొటీన్ అవుతుందని భావించిన మేకర్స్, ప్రియాంక కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. ఇప్పుడు ప్రియాంక రేంజ్ వేరు కనుక, ఈ సినిమాకు టైం కేటాయిస్తుందా? అన్నది డౌటే.













