Priyanka Chopra: మహేష్ తో పాటూ హృతిక్ ని లైన్ లో పెట్టిన ప్రియాంక
హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా వచ్చిన క్రిష్(krish) ఫ్రాంచైజ్ సినిమాలకు ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ లో మూడు భాగాలు రిలీజ్ కాగా, ఇప్పుడు నాలుగో భాగానికి రంగం సిద్ధమవుతుంది. అయితే ఈ నాలుగో పార్టుకు స్వయంగా హృతిక్ రోషనే దర్శకత్వం వహించనున్నాడు. దీంతో క్రిష్4(Krish4)పై అంచనాలు భారీగా పెరిగాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హృతిక్ సరసన హీరోయిన్ గా ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటించనున్నట్టు తెలుస్తోంది. క్రిష్ మూవీ నుంచే ప్రియాంక ఈ ఫ్రాంచైజ్ లో ప్రియ పాత్రలో కనిపిస్తూ వస్తుంది. క్రిష్, క్రిష్3(Krish3)లో ఆమె కీలక పాత్రలో కనిపించగా, రానున్న క్రిష్ 4లో ప్రియాంక చోప్రా పాత్ర మరింత కీలకం కానున్నట్టు అర్థమవుతుంది. ప్రియాంక క్రిష్4 లో నటిస్తుందని తెలిసినప్పటి నుంచి ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆనందంలో ఉన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటివరకు హృతిక్, ప్రియాంక కలిసి పలు సినిమాలు చేయగా, ఆ సినిమాలన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. హృతిక్, ప్రియాంకది బ్లాక్ బస్టర్ జంట. అందుకే వారి కలయికలో వచ్చిన క్రిష్, క్రిష్3, అగ్నిపథ్ సినిమాలు మంచి హిట్లుగా నిలవడంతో పాటూ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ప్రియాంక ఆల్రెడీ మహేష్(Mahesh)- రాజమౌళి(rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ప్రియాంక ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో భాగమైంది.













