Priyanka Arul Mohan: అలాంటి పాత్రలకు నో అంటున్న కన్మణి

హీరోయిన్లలో రెండు రకాలుంటారు. ఒకటి వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్ళడం, రెండు తమకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ, గ్లామర్ కు పెద్ద పీట వేయకుండా ఆడియన్స్ ను మెప్పించడం. అయితే వీరిలో మొదటి రకం హీరోయిన్లకు ఎక్కువ ఛాన్సులొస్తే, రెండో రకం వారికి మాత్రం వాళ్లు పెట్టుకున్న కండిషన్ల వల్ల కాస్త అవకాశాలు తక్కువగా వస్తుంటాయి.
అసలు మ్యాటర్ లోకి వస్తే చెన్నై భామ ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan), మొదట కోలీవుడ్ లో సినిమాలు చేసినప్పటికీ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడా మంచి పేరు తెచ్చుకుంది. గ్యాంగ్ లీడర్(gang leader) మూవీతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన ప్రియాంక ఇప్పటివరకు టాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే. అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ ప్రియాంకకు అనుకున్న అవకాశాలైతే రావడం లేదు.
రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) సరసన ఓజి(OG)లో కన్మణి(Kanmani) పాత్రలో మెరిసి ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకున్న ప్రియాంకకు వరుస అవకాశాలు రాకపోవడానికి కారణం తాను పెట్టుకున్న కండిషన్స్. అమ్మడు ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే గ్లామర్ షో మాత్రం చేయనని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. అలా స్ట్రిక్ట్ గా ఉండటం వల్లే ప్రియాంకకు ఎక్కువ ఛాన్సులు రావడం లేదని అందరూ అభిప్రాయపడుతున్నారు.