Priyanka Arul Mohan: ఇలా కూడా గ్లామర్ ఒలకబోయొచ్చా ప్రియాంక?
ఒంద్ కథే హెళ్ల(Ondh Kathe Hella) అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రియాంక మోహన్(Priyanka Mohan) తెలుగులో గ్యాంగ్ లీడర్(Gang leader) మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన ఛాన్సులు అందుకున్న ప్రియాంక రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా వచ్చిన ఓజి(OG) సినిమాలో ఆయనకు జోడీగా నటించి మెప్పించింది. ఎప్పుడూ ట్రెడిషనల్ గా, పక్కింటి అమ్మాయిలాగా అనిపించే ప్రియాంక రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోషూట్ హాట్ టాపిక్ గా మారింది. తనలోని గ్లామర్ యాంగిల్ ను బయటపెట్టాలని భావించినప్పటికీ ప్రియాంక దాన్ని కూడా హద్దులు దాటకుండానే చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫోటోల్లో ప్రియాంక ఎల్లో కలర్ లాంగ్ మిడ్డీ ధరించి దాని పై బ్లాక్ ఇన్నర్, బ్లాక్ కలర్ సూట్ ను ధరించి, మెడలో బంగారు ఆభరణంతో పోజులివ్వగా ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ప్రియాంక గ్లామర్ భలే డిఫరెంట్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలకు లైకులు కొడుతున్నారు.






