Priyanka Arul Mohan: ప్రియాంక దశ మారినట్టేనా?

అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉన్న హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఆ రెండూ ఉన్నా కూడా సక్సెస్ అవలేరు కొందరు. అందులో ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) కూడా ఒకరు. ప్రియాంక ఆల్రెడీ పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు కోరుకున్న స్టార్‌డమ్, ఫేమ్, గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో ఇప్పుడు తన ఆశలన్నీ ఓజి(OG) సినిమాపైనే పెట్టుకుంది.
ప్రియాంక సింప్లిసిటీకి, ఆమె అందానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ అయితే ఉన్నారు కానీ ప్రియాంకకు సక్సెస్ రేట్ చాలా తక్కువనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటివరకు టాలీవుడ్ లో కేవలం మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన ప్రియాంక ఇప్పుడు ఓజి రూపంలో పవన్(Pawan Kalyan) లాంటి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఈ సినిమా హిట్టైతే ప్రియాంక కెరీర్ మొత్తం మారిపోయినట్టే. ఓజి లో తన క్యారెక్టర్ సినిమానే మలుపుతిప్పుతుందని ముందు నుంచి ప్రియాంక చెప్పుకుంటూనే వస్తున్నప్పటికీ ప్రమోషన్స్ లో భాగంగా అలా చెప్పిందేమో అని అంతా అనుకున్నారు కానీ రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ప్రియాంక చెప్పింది నిజమే అనిపిస్తుంది. మరి ఓజితో అయినా ఈ అమ్మడికి అనుకున్న సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.