ఓజీపై అంచనాలను పెంచేసిన హీరోయిన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్‌సింగ్ తో పాటూ ఓజీ అనే సినిమాల్లో పవన్ నటిస్తున్నాడు. ఏపీ ఎలక్షన్స్ దృష్ట్యా ప్రస్తుతం సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన పవన్, ఎన్నికలయ్యాక తిరిగి వాటిని పూర్తి చేయనున్నాడు. అయితే పవన్ చేస్తున్న అన్ని సినిమాల్లోకెల్లా ఎక్కువ హైప్ ఉన్న సినిమా ఓజీనే.
పవన్ కు బాగా సూటయ్యే కథ అవడంతో పాటూ ఫ్యాన్స్ ఎలా అయితే ఆయన్ని చూడాలనుకుంటున్నారో అలాంటి కథతో ఓజీ రూపొందుతుంది. ప్రభాస్ సాహోతో నార్త్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసిన సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ క్యూట్ బ్యూటీ పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓజీ సినిమా అందరూ అనుకుంటున్నట్లే అద్భుతంగా వస్తుందని కచ్ఛితంగా స్క్రీన్ పై చూసినప్పుడు అద్భుతమైన ఫీల్ ను పొందుతారని పవన్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే వ్యాఖ్యలు చేసింది. ఇక పవన్ గురించి చెప్తూ, ఆయన గొప్ప వ్యక్తి, గ్రేట్ లీడర్, లెజెండ్ అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. ఇప్పటికే ఓజీ సినిమాపై భారీ అంచనాలుండగా, ప్రియాంక వ్యాఖ్యలతో అవి మరింత పెరిగాయి. ఓజీ ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది.













