Priyamani: నా భర్త గురించి తెలియని వారు కూడా అతన్ని కామెంట్ చేస్తున్నారు: ప్రియమణి
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో ఏళ్లవుతున్నా ప్రియమణి(Priyamani) ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. సినిమాలు, సిరీస్లు, టీవీ షో లతో దూసుకెళ్తున్న ప్రియమణికి సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. తాజాగా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో తనను కావాలని కొంతమంది టార్గెట్ చేస్తున్నారని తెలిపింది.
పెళ్లి చేసుకున్న తర్వాత తనను చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేశారని, తనను మాత్రమే కాకుండా తన భర్తను, పుట్టబోయే పిల్లల్ని కూడా ఇందులోకి లాగుతున్నారని ప్రియమణి బాధ పడింది. కేవలం తాను మతాంతర వివాహం చేసుకోవడం వల్లే తనను ఇలా ఇబ్బందులు పెడుతున్నారని అభిప్రాయపడింది ప్రియమణి.
2017లో ప్రియమణి ముస్తాఫా రాజ్(Musthafa Raj) ను పెళ్లి చేసుకుంది. 2016లోనే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ విషయాన్ని తన వాళ్లతో చెప్పుకుంటే అందరూ సంతోషిస్తారనుకుంటే రివర్స్ లో అందరూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారని, లవ్ జిహాది అంటూ తనపై, తన భర్తపై కామెంట్స్ చేశారని అంటోంది. తన భర్త గురించి అసలేమాత్రం తెలియని వారు కూడా ఆయన గురించి అలా నెగిటివ్ కామెంట్స్ పెట్టడాన్ని ప్రియమణి తప్పుబడుతూ వారిపై ఫైర్ అయింది. ఈ కారణంతోనే తాను ఇప్పటికీ తన భర్తతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయాలంటే భయపడుతున్నట్టు ప్రియమణి వెల్లడించింది.













