మల్టీస్టారర్ మూవీ లో ప్రియా ప్రకాష్ వారియర్..?
కేవలం ఒకేఒక్క సాంగ్ తో తన ఎక్స్ప్రెషన్స్ తో ఓవర్ నైట్ స్టార్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్. మెస్మరైజింగ్ లుక్స్ తో యువతరం మతి పోగొట్టింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ” ఓరు ఆదార్ లవ్ ” అనే సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ అమ్మడు తెలుగులో రెండు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నితిన్ సరసన చెక్ సినిమాలో నటించగా, యంగ్ అప్ కమింగ్ హీరో తేజ సరసన ఇష్క్ సినిమాలో జత కట్టింది ప్రియా. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆశించినంత విజయాన్ని అందించలేదని చెప్పాలి.
ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాల కోసం ఈ అమ్మడు విశ్వ ప్రయత్నాలు చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ హీరోయిన్ కి ఒక మల్టీ స్టార్రర్ మూవీ లో నటించే అవకాశం వచ్చిందంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న “వినోదయ సీతం” చిత్రం లో ఈ అమ్మడు కూడా నటించే అవకాశం వచ్చిందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ 20 డేస్ షెడ్యూల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ కేతిక శర్మ జోడి గా నటిస్తుంది. ఇక పవర్ స్టార్ పక్కన జోడిగా ఎవరు నటిస్తున్నారు అన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. మరి పవన్ పక్కన ప్రియా వారియర్ జంటగా కనిపించనుందా అని అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ పాత్ర పై ఇప్పటివరకు ఎలాంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఒకవేళ పవన్ పక్కన ఈ ముద్దుగుమ్మ నటించే ఛాన్స్ వస్తే ఇక ప్రియా ఫేట్ మారిపోయినట్టే అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రెజెంట్ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది.













