Prabhas: ప్రభాస్ ప్రైవేట్ పర్సన్ అంటున్న పృథ్వీరాజ్
బాహుబలి(Baahubali) సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్, క్రేజ్ బాగా పెరిగాయి. బాహుబలి తర్వాత ప్రభాస్(Prabhas) ప్రతీ సినిమాను పాన్ ఇండియా లెవెల్లోనే తీస్తున్నాడు. సలార్(Salaar), కల్కి(Kalki) సినిమాలతో వరుస హిట్లు అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్(Raja Saab), ఫౌజి(Fouji) సినిమాలను చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత సలార్2(Salaar2), కల్కి2(Kalki2)తో పాటూ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్(Spirit) చేయాల్సి ఉంది ప్రభాస్.
ఇదిలా ఉంటే సలార్ లో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి పృథ్వీరాజ్(Prithvi Raj Sukumaran) సలార్2(Salaar2) గురించి, ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సలార్2 స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తైందని, ఎన్టీఆర్(NTR) తో చేసే నీల్(Neel) సినిమా షూటింగ్ పూర్తవగానే సలార్2 సెట్స్ పైకి వెళ్తుందని పృథ్వీరాజ్ తెలిపాడు. ఇక ప్రభాస్ గురించి చెప్తూ హీరోగా తన కున్న స్టార్డమ్ ఆయనకు తెలియదని, తనకు తెలిసినంత వరకు ప్రభాస్ కనీసం సోషల్ మీడియా కూడా వాడడని తెలిపాడు.
అంతేకాదు, ప్రభాస్ ప్రైవేట్ పర్సన్ అని, బాగా క్లోజ్ అయిన వారితో మాత్రమే ఆయన అన్ని విషయాలను ప్రస్తావిస్తుంటారని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ గురించి పృథ్వీరాజ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ఎల్2: ఎంపురాన్(L2: Empuraan) మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది













