Premante: ‘ప్రేమంటే’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను – నాగ చైతన్య
‘ప్రేమంటే’ చిత్రం అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.. ఈ మూవీతో ఆడియెన్స్ నుంచి మరింత ప్రేమను సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను – లవ్ ట్రోట్టర్ ఈవెంట్లో హీరో ప్రియదర్శి
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, స్పిరిట్ మీడియా బ్యానర్ల మీద సొనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్ దాస్ కె నారంగ్ దివ్యాశీస్సులతో జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమంటే’. థ్రిల్లు ప్రాప్తిరస్తు అనేది ఉప శీర్షిక. ఈ మూవీలో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించారు. ఈ సినిమాకు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా, ఆదిత్య మేరుగు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ నవంబర్ 21న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు లవ్ ట్రోట్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువ సామ్రాట్ నాగ చైతన్య, సెన్సేషనల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో..
నాగ చైతన్య మాట్లాడుతూ .. ‘నారాయణ్ దాస్ కె నారంగ్ గారు, సునీల్ నారంగ్ గార్ల వారసత్వాన్ని జాన్వీ ముందుకు తీసుకు వెళ్తున్నారు. వీరి బ్యానర్లో ‘లవ్ స్టోరీ’ లాంటి మంచి సినిమాను చేయడం, వారి ద్వారానే శేఖర్ కమ్ముల పరిచయం అవ్వడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు మళ్లీ ‘ప్రేమంటే’ అనే లవ్ స్టోరీ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు రావడం ఆనందంగా ఉంది. నవనీత్ గారు మంచి పాయింట్‌తో కొత్త ప్రేమ కథను అందివ్వబోతోన్నారు. ప్రియదర్శి మంచి నటుడు. అన్ని రకాల పాత్రల్ని అద్భుతంగా పోషిస్తున్నారు. ఆనంది గారు ‘కస్టడీ’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించారు. ఆమె మంచి నటి. సుమ గారిని ఇలాంటి ఓ మంచి పాత్రలో చూడటం ఆనందంగా ఉంది. ‘ప్రేమంటే’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నవంబర్ 21న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ .. ‘‘ప్రేమంటే’ టీంకి కంగ్రాట్స్. ప్రియదర్శిని చాలా ఏళ్ల నుంచి గమనిస్తూనే ఉంటున్నాను. ఆయనెప్పుడూ మంచి కథల్నే ఎంచుకుంటూ ఉంటారు. నవనీత్ ఈ మూవీతో మంచి విజయం దక్కాలి. ఆనంది అద్భుతమైన నటి. ఆమె నటించిన చిత్రాలెన్నో చూశాను. యంగ్ టాలెంట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వస్తోంది. ‘ప్రేమంటే’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
వీడియో బైట్ ద్వారా రానా దగ్గుబాటి మాట్లాడుతూ .. ‘‘ప్రేమంటే’ ఈవెంట్లో నాకెంతో ఇష్టమైన నాగ చైతన్య, శేఖర్ కమ్ముల గారు ఉండటం ఆనందంగా ఉంది. ‘ప్రేమంటే’ టీంకు, జాన్వీ నారంగ్‌కు ఆల్ ది బెస్ట్. నవంబర్ 21న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.
సురేష్ బాబు మాట్లాడుతూ .. ‘‘పెళ్లి చూపులు’ నుంచి ప్రయాణం మొదలు పెట్టిన ప్రియదర్శి ఈ స్థాయికి రావడం ఆనందంగా ఉంది. జాన్వీకి ఈ మూవీతో పెద్ద హిట్ అవ్వాలి. ఆనంది అద్భుతంగా నటిస్తారు. ‘ప్రేమంటే’ మంచి విజయాన్ని సాధించాలి. నవంబర్ 21న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.
నిర్మాత జాన్వీ నారంగ్ మాట్లాడుతూ .. ‘‘ప్రేమంటే’ చిత్రానికి సపోర్ట్ చేసిన టీం అందరికీ థాంక్స్. నవంబర్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
సుమ కనకాల మాట్లాడుతూ .. ‘నేను నారాయణ్ దాస్ గారు, సునీల్ నారంగ్ గారు, జాన్వీ గారు చేసిన చిత్రాలకు పని చేశాను. మూడు తరాలుగా వారు ఇండస్ట్రీకి సేవలు అందిస్తూనే ఉన్నారు. జాన్వీ గారికి ఇండస్ట్రీలోకి తిరుగులేదు. సినిమా మీద నవనీత్‌కి ఉండేదే ‘ప్రేమంటే’.ఈ టీంకి సినిమా మీద ఉండేదే ప్రేమంటే. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చినందుకు నవనీత్‌కు థాంక్స్. ప్రియదర్శి మంచి నటుడు. ఆయనెప్పుడూ రిస్క్ చేసేందుకు ముందుంటాడు. ఆనంది అద్భుతమైన నటి. మంచి చిత్రాల్ని ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నవంబర్ 21న రాబోతోన్న ‘ప్రేమంటే’ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ .. ‘నన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తున్న, సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు, అభిమానులకు థాంక్స్. ఏసియన్ వంటి భారీ నిర్మాణ సంస్థలో సినిమా చేసే స్థాయికి ఎదిగాను. నవనీత్ చెప్పిన కథ విని చాలా సంతోషంగా అనిపించింది. కథ విన్న వెంటనే జాన్వీ గారికి ఫోన్ చేసి చెప్పాను. సునీల్ నారంగ్ గారికి జాన్వీ గారంటే చాలా ఇష్టం. నారాయణ దాస్ గారు చాలా గొప్ప వ్యక్తి. నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలందించిన గొప్పవారాయన. జాన్వీ గారి నేతృత్వంలో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో మంచి పాత్రను పోషించిన సుమ గారికి థాంక్స్. ఆనంది గారి నటనకు నేను పెద్ద అభిమానిని. ఆమె అద్భుతమైన నటి. విశ్వ విజువల్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి. ఈ మూవీకి లియోన్ గారి మ్యూజిక్ ప్రధాన బలం. కో ప్రొడ్యూసర్ ఆదిత్య గారికి చాలా ఓర్పు, సహనం ఉంటుంది. మా కోసం వచ్చిన నాగ చైతన్య గారికి, శేఖర్ కమ్ముల గారికి థాంక్స్. ఈ మూవీకి పని చేసిన, సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందమైన కథతో తెరకెక్కిన నవంబర్ 21న ‘ప్రేమంటే’ రాబోతోంది. ఈ మూవీతో ఆడియెన్స్ నుంచి మరింత ప్రేమను సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. ‘ప్రేమంటే’ చిత్రం అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది’ అని అన్నారు.
హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ .. ‘‘ప్రేమంటే’ కోసం వచ్చిన నాగ చైతన్య గారికి, శేఖర్ కమ్ముల గారికి, సురేష్ బాబు గారికి థాంక్స్. నాకు తమిళంలో చాలా మంచి పేరు వచ్చింది. తెలుగులో మాత్రం ఇంకా నన్ను నేను ఫ్రూవ్ చేసుకోలేదనే ఫీలింగ్ ఉంటుంది. ‘ప్రేమంటే’ చిత్రంతో ఆ లోటు తీరుతుందని భావిస్తున్నాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన నవనీత్ గారికి థాంక్స్. నవనీత్ గారు అద్భుతమైన కథను రాసుకున్నారు. ఈ మూవీ కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. ప్రియదర్శి గారు చాలా మంచి వ్యక్తి. ఈ ప్రయాణంలో సుమ గారిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. నవంబర్ 21న ‘ప్రేమంటే’ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ మాట్లాడుతూ .. ‘నేను ‘ప్రేమంటే’ చిత్రానికి రైటర్, డైరెక్టర్ని. ఈ ప్రయాణంలో నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసిన మా అమ్మకి థాంక్స్. నాలుగేళ్ల క్రితం ఈ మూవీ కోసం ప్రయాణం మొదలు పెట్టాను. అప్పుడు నాకు తెలుగు వచ్చేది కాదు. ఎన్నో ఆఫీస్‌ల చుట్టూ తిరిగాను. అలాంటి టైంలోనే జాన్వీ గారిని కలిశాను. అప్పుడు నాకు ఈ మూవీ జరుగుతుందని నమ్మకం ఏర్పడింది. జాన్వీ గారి సహకారంతోనే ఈ చిత్రం ఈ స్థాయి వరకు వచ్చింది. నన్ను నమ్మిన సునీల్ నారంగ్ గారికి, పుస్కుర్ రామ్ మోహన్ గారికి, ఆదిత్య గారికి థాంక్స్. విశ్వనాథ్ గారి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. ఎడిటర్ రాఘవేంద్రన్ గారు నాకెంతో సపోర్ట్ చేశారు. లియోన్ గారు మంచి పాటల్ని, అద్భుతమైన ఆర్ఆర్ను అందించారు. ఆర్ట్ డైరెక్టర్ అరవింద్ గారికి మూడేళ్ల క్రితం ఈ కథను చెప్పాను. ఆయన మాకు అద్భుతమైన సెట్స్ చేసి ఇచ్చారు. నాకు సపోర్ట్ చేసిన డైరెక్షన్ టీంకు థాంక్స్. సుమ గారి పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఆనంది గారు అద్భుతంగా నటించారు. ‘మల్లేశం’ తరువాత ప్రియదర్శి అన్నని కలిశాను. ఆ మూవీతోనే ప్రియదర్శికి సినిమా పట్ల ఉన్న ప్యాషన్, ఇష్టం అర్థమైంది. ‘ప్రేమంటే’ కథను అంగీకరించిన ప్రియదర్శికి థాంక్స్. పెళ్లి తరువాత ఎన్ని గొడవలు వచ్చినా సరే ఓ చాయ్ తాగుతూ మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాలి అనేదే ఈ మూవీ పాయింట్. నవంబర్ 21న ‘ప్రేమంటే’ మూవీని చూడండి. మా చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
హైపర్ ఆది మాట్లాడుతూ .. ‘‘ప్రేమంటే’ చిత్రంలో సుమ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ప్రియదర్శి వెర్సటైల్ యాక్టర్. మన తెలుగమ్మాయి ఆనంది గారు మంచి నటి. నవనీత్‌కు ఈ మొదటి ప్రయత్నంతోనే మంచి విజయం దక్కాలి. నవంబర్ 21న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.
లియోన్ జేమ్స్ మాట్లాడుతూ .. ‘‘ప్రేమంటే’ సినిమాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నవనీత్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఆయన పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. ఇదొక సూపర్ క్లీన్ మూవీ. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. మంచి ప్రేమ కథతో వస్తున్న ఈ చిత్రంలో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. నవంబర్ 21న ఈ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
కెమెరామెన్ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘ప్రేమంటే’ ప్రయాణం దాదాపు 8 నెలల క్రితం ప్రారంభించాం. నవనీత్ చెప్పిన స్టోరీ, ఆ ఎనర్జీ చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. ప్రతీ రోజూ డబుల్ ఎనర్జీతో షూటింగ్ చేశాం. నటీనటులందరూ చాలా రిలాక్స్డ్గా, అద్బుతంగా పర్ఫామ్ చేసేలా దర్శకుడు చూసుకున్నారు. సుమ గారి సీన్లు అద్భుతంగా వచ్చాయి. ఆదిత్య గారు, జాన్వీ గారు ఎప్పుడూ సినిమా సెట్‌కు సంబంధించిన అప్డేట్ తెలుసుకుంటూనే ఉండేవారు. ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది. నవంబర్ 21న అందరూ చూడండి’ అని అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ అరవింద్ మాట్లాడుతూ .. ‘‘ప్రేమంటే’ మూవీని అందరూ కలిసి ఎంతో సరదాగా చేశాం. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. నవంబర్ 21న మా మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.
డైలాగ్ రైటర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘ప్రేమంటే’ సినిమాకు డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సుమ గారే ఈ మూవీకి నన్ను రిఫర్ చేశారు. ఆమె వల్లే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. నవనీత్ గారు ఈ మూవీతో చాలా మంది కొత్త వారిని ఇంట్రడ్యూస్ చేశారు’ అని అన్నారు.
లిరిక్ రైటర్ సనారే మాట్లాడుతూ .. ‘‘ప్రేమంటే’ చిత్రంలో సుమ గారి ఇంట్రోకి ఎలివేషన్ ఇచ్చే ‘ఆశా మేరీ’ పాటను రాశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.






