వార్2 కోసం క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్
హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ కాంబోలో వార్2 అనే భారీ మల్టీస్టారర్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడని బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ప్రీతమ్ చక్రవర్తిని ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారని టాక్. ఎన్నో క్రేజీ ఆల్బమ్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డ్ ప్రీతమ్ కు ఉంది.
యష్ రాజ్ ఫిల్మ్స్ ధూమ్ నుంచే ప్రీతమ్ కెరీర్ బాగా ఊపందుకుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు, చార్ట్‌బస్టర్స్ తో తన క్రేజ్‌ను, ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ కు పలు అవార్డులు అందుకున్న ప్రీతమ్ ఇప్పుడు మరోసారి వార్-2 కోసం అయాన్ తో కలిసి జట్టు కట్టనున్నాడు. ఇదే నిజమైతే తారక్ కు ప్రీతమ్ ఇచ్చే మొదటి ఆల్బమ్ వార్-2నే కానుంది.
త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. హృతిక్-ఎన్టీఆర్ మధ్య వచ్చే ఓ స్పెషల్ సాంగ్ ను నాటు నాటు పాటను మించిపోయేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొరియోగ్రఫీ కూడా అదే రేంజ్ లో ఉండేలా చూస్తారట. వినడానికే చాలా క్రేజీగా ఉంది కదా. ఈ లెక్కన వార్2పై అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ లో రిలీజ్ కానుంది.













