బన్నీ, ప్రశాంత్ ల కలయిక వెనుక కారణమదేనా..?
కేజీఎఫ్ ఛాప్టర్1 తర్వాత ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ అన్ని పరిశ్రమలకు చాలా సుపరిచితుడైపోయాడు. పాన్ ఇండియా డైరక్టర్లలో ఒకడిగా పాపులర్ అయ్యేంత ఫేమ్ ప్రశాంత్ కి వచ్చింది. ప్రస్తుతం కేజీఎఫ్2 సినిమాను పూర్తి చేసే పనిలో చాలా బిజీగా ఉన్న ప్రశాంత్ డార్లింగ్ సలార్ తో సలార్ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసేశారు.
అయితే ఇప్పుడు ఈ రెండు సినిమా విషయాల్లో కాకుండా ప్రశాంత్ మరో విధంగా న్యూస్ లో నిలిచాడు. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కలవడం ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో వీరిద్దరూ కలిశారని, బన్నీ తో చేసే సినిమా కోసమే వీరిద్దరి చర్చలు జరిపారని, త్వరలోనే వీరి కాంబినేషన్ లో సినిమా రావచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ప్రశాంత్ నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న కేజీఎఫ్2 జులై 16న విడుదల కానుంది. పాన్ ఇండియా సినిమాగా అనేక భాషల్లో కేజీఎఫ్ రిలీజ్ కానుంది. కేజీఎఫ్ తర్వాత సలార్ సినిమా, దాని తర్వాత ఎన్టీఆర్ తో సినిమా, ఆ తర్వాతే ఉంటే బన్నీ తో ప్రశాంత్ సినిమా ఉండే అవకాశాముంది.













