సలార్ గురించి నీల్ ముచ్చట్లు
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత పెరగనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ రీసెంట్గా ఓ బాలీవుడ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
సలార్ ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ అని, కలిసి పెరిగిన వాళ్లిద్దరూ శత్రువులుగా మారడానికి కొన్ని పరిస్థితులు ఎదురవుతాయని, పార్ట్ వన్ లో ఫ్రెండ్స్ కు సంబంధించిన సగం కథ మాత్రమే చెప్పబోతున్నాట్లు, అందులో కూడా బలమైన ఎమోషన్ ఉంటుందని నీల్ వివరించాడు. అయితే సలార్, కెజిఎఫ్ రెండింటికీ ఒకదానితో మరో దానికి సంబంధం ఉండదని నీల్ వెల్లడించాడు.
ఇక సలార్ సెకండ్ పార్ట్ గురించి చెప్తూ, షూటింగ్ వీలైనంత త్వరగా చేస్తామని చెప్పిన ప్రశాంత్ నీల్, రిలీజ్ డేట్ గురించి మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నాడు. సలార్ కథ పెద్దది కావడం వల్లనే రెండు భాగాలుగా చేయాల్సి వచ్చిందని చెప్పాడు ప్రశాంత్ నీల్. మొత్తానికి సలార్ కోసం ప్రశాంత్ నీల్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నాడు.













