అస్కార్ బరిలో మోతీ భాగ్ ?
ప్రస్తుత కాలంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ల సమస్యలేంటి? ఎందుకు వలస వెళ్లిపోతున్నారనే నేపథ్యంలో రూపొందిన డాక్యుమెంటరీ చిత్రం మోతీ భాగ్. ఉత్తరాఖండ్‌లో నివసించే విద్యుత్ అనే రైతు జీవితం ఆధారంగా దర్శకుడు నిర్మల చందర్ దండ్రియాల్ ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఇటీవల ప్రకటించారు. ఇలాంటి సినిమాలే యువతను తమ ప్రాంతాల్లోనే ఉండేలా ప్రేరణనిస్తాయి. వలసలు వెళ్లిపోవడాన్ని కూడా తగ్గిస్తాయి. మోతీ భాగ్ టీమ్‌కు కంగ్రాట్స్ అని పేర్కొన్నారాయన.













