ప్రశాంత్ యూనివర్స్‌లోకి మరో హీరో
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(Prasanth varma cinematic universe) కు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. హనుమాన్(Hanu Man) సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ వర్మ(Prasanth Varma) బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో 10 సినిమాల వరకు రానున్నట్లు అతను ఇప్పటికే తెలిపాడు. ఈ యూనివర్స్‌లో బాలకృష్ణ(Bala krishna) కొడుకు మోక్షజ్ఞ(Mokshagna) డెబ్యూ సినిమా కూడా ఉండనుంది.
జై హనుమాన్(jai Hanuman) ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే రానుంది. వాటితో పాటూ డీవీవీ దానయ్య(DVV Danayya) కొడుకు సినిమా కూడా అందులోనే ఉండనుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ప్రశాంత్ వర్మ ఈ యూనివర్స్ లో చాలా ప్రాజెక్టులనే లైన్ లో పెట్టాడు. ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంత్ వర్మ ఈ యూనివర్స్ లో ఓ సినిమా కోసం కార్తీ(Karthi)ని కలిసి కథ చెప్పినట్లు సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Satyam Sundaram pre release event)లో తెలిపాడు.
కొన్ని నెలల కిందట ప్రశాంత్ వర్మ చెప్పిన కథ కార్తీకి కూడా నచ్చిందని, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయడానికి కార్తీ ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు. దీంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU) లో కార్తీ సినిమా రావడం కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఓ వైపు బాలయ్య కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేసే పెద్ద బాధ్యతను తీసుకుంటూనే మరోవైపు ప్రశాంత్ వర్మ తన యూనివర్స్ లో మిగిలిన సినిమాల పనులు కూడా చేస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు.













