ప్రశాంత్ వర్మకు బాలయ్య ఆ ఛాన్సిస్తాడా?
నందమూరి బాలకృష్ణ(Nandamuri Bala Krishna) కెరీర్లోనే ఆదిత్య 369(Aditya369)కు స్పెషల్ ప్లేస్ ఉంది. తెలుగులో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో కమర్షియల్ గా కూడా బాగా వర్కవుట్ అయింది. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మూవీస్ లిస్ట్ లో ఆదిత్య 369 కూడా ఉంటుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తర్వాత కూడా ఈ కాన్సెప్తో సినిమాలు చేయడానికి ఎవరూ సాహసం చేయలేదు.
వ్యక్తిగతంగా బాలయ్య(Balayya)కు కూడా ఈ సినిమా అంటే ఎంతో అభిమానముంది. అందుకే ఈ సినిమాకు ఆదిత్య 999(Aditya999) టైటిల్ తో సీక్వెల్ చేస్తానని ఆ సినిమాను తానే డైరెక్ట్ చేస్తానని బాలయ్య గతంలో తెలిపాడు. అంతేకాదు ఆదిత్య 999 తోనే మోక్షజ్ఞ(Mokshagna) ఎంట్రీ కూడా ఉంటుందని బాలయ్య(Balaiah) చెప్పాడు. కానీ సడెన్ గా ఆ సినిమాను హోల్డ్ గా పెట్టి ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞను లాంచ్ చేస్తున్నాడు బాలకృష్ణ.
ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ హిట్ కొడితే మరో ఆఫర్ కూడా ఇవ్వనున్నాడట బాలకృష్ణ. అదే ఆదిత్య 999. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల్ని ప్రశాంత్ వర్మకు అప్పగించే ఛాన్సుందని, ఇప్పటికే బాలయ్య ప్రశాంత్ వర్మకు ఓ మాట చెప్పి పెట్టాడని టాక్ వినిపిస్తోంది. దీంతో పాటూ భైరవద్వీపం సీక్వెల్(Bhairava Dweepam Sequel) బాధ్యతలు కూడా ప్రశాంత్ వర్మకు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలను కూడా మోక్షజ్ఞతోనే చేయడానికి బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞకు ఎలాంటి డెబ్యూ ఇస్తాడనే దానిపై ఈ రెండు సినిమాలు ఆధారపడి ఉన్నాయి.













