NTR31: చైనాను టార్గెట్ చేసిన నీల్?
కెజిఎఫ్(KGF), కెజిఎఫ్2(KGF2)తో భారీ ప్రయోగం చేసి ప్రశాంత్ నీల్(Prasanth Neel) కెజిఎఫ్2తో రకూ.1000 కోట్ల క్లబ్ లో చేరాడు. దీంతో అతని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ప్రభాస్(Prabhas) తో సలార్1(Salaar1) చేసి రూ.700 కోట్లకు పైగా వసూలు చేసిన ఆయన చేతిలో ప్రస్తుతం సలార్2(Salaar2) తో పాటూ ఎన్టీఆర్(NTR) తో ఓ సినిమా ఉన్నాయి. ఈ రెండు సినిమాల కోసం నీల్ నెక్ట్స్ లెవెల్ స్క్రిప్ట్స్ ను రెడీ చేస్తున్నాడని సమాచారం.
అయితే యష్(Yash), ప్రభాస్ తో ప్రయోగం చేసినట్టే నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్ గా లాంచ్ కూడా చేశారు. ఎన్టీఆర్-నీల్ కాంబోలో రానున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తారక్(Tarak) తో నీల్ ఎలాంటి ప్రయోగం చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథ బంగ్లాదేశ్‌కు, చైనాతోనూ కనెక్షన్ ఉంటుందని తెలుస్తోంది. ఇండియా నుంచి బంగ్లాదేశ్ వెళ్లి పోరాడే తెలుగు వాడు డ్రాగన్. బంగ్లాదేశ్ లో సవాళ్లను ఎదుర్కొంటున్న తెలుగు ప్రేక్షకులకు రక్షకుడిగా డ్రాగన్ లో ఎన్టీఆర్ పాత్రను నీల్ డిజైన్ చేశాడని, వలసదారుల చుట్టూ స్క్రీన్ ప్లే నడుస్తుందని సమాచారం. డ్రాగన్(Dragon) అనేది చైనా సంస్కృతిలో ఓ భాగం. అందుకే దీన్ని టైటిల్ గా పెడితే అక్కడి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారని నీల్ ఆలోచిస్తున్నాడట. టైటిల్, కంటెంట్ తో చైనా ఆడియన్స్ కనెక్ట్ అయితే ఎన్టీఆర్31(NTR31)కు లక్ దక్కినట్టే అని చెప్పొచ్చు.













