మెక్సికో నుంచి మొదలుపెట్టనున్న ఎన్టీఆర్, నీల్
ప్రస్తుతం దేవర సినిమాను పూర్తి చేస్తూనే మరోవైపు వార్2 షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పటికే మొదలయ్యాయి.
ఆగస్ట్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్ల ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఆగస్ట్ నుంచి మొదలవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ మెక్సికోలో మొదలుపెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ కథకు అక్కడి బ్యాక్ డ్రాప్ అయితేనే బాగుంటుందని మొదటి షెడ్యూల్ ను మెక్సికోలో ప్లాన్ చేసినట్లు లీకులందుతున్నాయి.
మొదటి షెడ్యూల్ లో ఎక్కువగా యాక్షన్ సీన్సే ఎక్కువగా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మేజర్ పార్ట్ షూటింగ్ కూడా దాదాపు 15 దేశాల్లో ఉంటుందని చిత్ర వర్గాలంటున్నాయి. ప్రశాంత్ నీల్ తీసిన కెజిఎఫ్, సలార్ సినిమాల షూటింగ్ ఇండియాలోనే జరిగాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ ను కొత్తగా ప్రెజెంట్ చేయడం కోసం సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.













