Prabhudeva: కొడుకుతో ప్రభుదేవా జర్నీ కంటిన్యూ
ప్రభుదేవా(Prabhudeva) రీసెంట్ గా చెన్నైలో ఓ కాన్సర్ట్ చేశాడు. ప్రభుదేవా లైవ్ డ్యాన్స్ వైబ్ పేరుతో జరిగిన ఆ కాన్సర్ట్ కు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు హజరయ్యారు. అయితే ఈ కాన్సర్ట్ లో ప్రభుదేవా తన కొడుకు రిషి రాగ్వేందర్ను ఆడియన్స్ కు పరిచయం చేశాడు. తన కొడుకు ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ గురించి ఎక్స్‌లో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు ప్రభుదేవా.
తన కొడుకు రిషి రాగ్వేందర్ దేవా(Rishi Ragvendar Deva)ను పరిచయం చేయడం ఎంతో గర్వంగా ఉందని, తామిద్దరం కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి అని, ఇది కేవలం ఓ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదని, అంతకంటే ఎక్కువని, ఇది తన వారసత్వమని, ఇప్పుడే మొదలవుతున్న జర్నీ అని ప్రభుదేవా పోస్ట్ చేశాడు.
ప్రభుదేవాకు ఇద్దరు పిల్లలుండగా అందులో ఒకరు రిషి రాగ్వేందర్, మరొకరు అదిత్(Adith). రిషి రాగ్వేందర్ డ్యాన్స్ వీడియోను చూసిన ఆయన అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. రిషి రాగ్వేందర్ తో ప్రభుదేవా కాలు కదపడం ఇప్పుడు అందరి దృష్టిని ఎట్రాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన వారంతా రిషి అచ్చం ప్రభుదేవా లానే ఉన్నాడని, ఆయనలానే డ్యాన్స్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.













