Raja Saab: జులై నుంచి రాజా సాబ్ కోసం ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) నటిస్తున్న సినిమాల్లో మారుతి(maruthi) దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్(raja Saab) కూడా ఒకటి. ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైనప్పటి నుంచి ఆడియన్స్ కు రాజా సాబ్ పై అంచనాలు పెరిగాయి. అప్పటివరకు పెద్దగా బజ్ లేని రాజా సాబ్ కు ఒక్కసారిగా టీజర్ విపరీతమైన హైప్ ను తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే రాజా సాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కు వచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు రాజా సాబ్ కు సంబంధించి ఓ కొత్త అప్డేట్ వినిపిస్తోంది. త్వరలోనే రాజా సాబ్ కొత్త షెడ్యూల్ మొదలు కానుండగా, ఆ షెడ్యూల్ లో ప్రభాస్ జులై ఫస్ట్ వీక్ నుంచి జాయిన్ కానున్నాడని తెలుస్తోంది. హైదరాబాద్ లో నిర్మించిన భారీ ప్యాలెస్ సెట్ లో ఈ షూటింగ్ జరగనుండగా, ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటూ మిగిలిన ప్రధాన తారాగణం కూడా పాల్గొననున్నట్టు సమాచారం.
ఈ షెడ్యూల్ తో రాజా సాబ్ టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని, ఆ తర్వాత సాంగ్స్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. కశ్మీర్ లో కూడా ఓ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. నిధి అగర్వాల్(niddhi Agerwal), మాళవిక మోహనన్(Malavika mohanan), రిద్ధి కుమార్(riddhi kumar) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People media factory) భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, తమన్(thaman) రాజా సాబ్ కు సంగీతం అందిస్తున్నాడు.