Fauji: రేపటి నుంచి ఫౌజికి ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్(The Raja Saab) కాగా, రెండోది హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజి. ఈ రెండు సినిమాలను సమాంతరంగా పూర్తి చేస్తూ వస్తున్న ప్రభాస్ గత కొన్నాళ్లుగా రెస్ట్ లో ఉన్నాడు. షూటింగ్ లో జరిగిన గాయం వల్ల డాక్టర్లు ప్రభాస్ కు రెస్ట్ తీసుకోమని చెప్పారు.
దీంతో ప్రభాస్ తన ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో కలిసి ఇటలీ వెళ్లి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే తన ఆరోగ్యాన్ని పూర్తిగా సెట్ చేసుకున్న ప్రభాస్ రీసెంట్ గానే హైదరాబాద్ వచ్చాడు. సిటీకి వచ్చిన ప్రభాస్ ఫౌజి(Fauji) షూటింగ్ ను మొదలుపెట్టి అందులో పాల్గొనాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ రేపటి నుంచి ఫౌజి కొత్త షెడ్యూల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందులో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడని సమాచారం.
ప్రభాస్ పర్మిషన్ తోనే దర్శకనిర్మాతలు నెక్ట్స్ షెడ్యూల్ ను రేపటి నుంచి ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీని కోసం మేకర్స్ భారీ సెట్స్ ను కూడా వేయించినట్టు తెలుస్తోంది. ఇమాన్వీ(Imanvi) హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఎంతోమంది టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ఫౌజితో పాటూ రాజా సాబ్ ను కూడా త్వరగా పూర్తి చేసి, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో కలిసి స్పిరిట్(Spirit) చేయాలని చూస్తున్నాడు ప్రభాస్.