స్పిరిట్ ఈ ఏడాది లేనట్టే!
సలార్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులున్నాయి. గతేడాది వచ్చిన ఆదిపురుష్, సలార్ రెండూ పెద్ద సినిమాలే. ఇక తర్వాత రిలీజ్ కానున్న కల్కి గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్ సినిమాను ముందు చిన్న సినిమా అనుకున్నారు.
కానీ రాజా సాబ్ వీఎఫ్ఎక్స్ తో కూడుకున్న పెద్ద రేంజ్ సినిమా అని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చేయాల్సి ఉంది. రీసెంట్ గా యానిమల్ ను రిలీజ్ చేసి ఆ సక్సెస్ను ఎంజాయ్ చేసిన సందీప్ ఇప్పుడు ఫ్రీ అయ్యాడు. ఇక స్పిరిట్ స్క్రిప్ట్ తీసుకొస్తే వెంటనే ప్రభాస్ దాన్ని సెట్స్ కు తీసుకెళ్తాడని మొన్నటివరకు అందరూ అనుకున్నారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి స్పిరిట్ ను ప్రభాస్ హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. సలార్-2 సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి దాన్ని పూర్తి చేయాలని చూస్తున్నాడట ప్రభాస్. సలార్-2కు స్క్రిప్ట్ కూడా రెడీ అవడంతో ఈ సినిమాను త్వరగా షూట్ చేసి నెక్ట్స్ ఇయర్ సమ్మర్ కు రిలీజ్ చేయాలని ప్రభాస్, ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారట. ఇటువైపు సందీప్ కూడా యానిమల్ సక్సెస్ తర్వాత యానిమల్ పార్క్ చేయాల్సి ఉంది. ఈ లోగా ఇద్దరికి తమ తమ కమిట్మెంట్స్ పూర్తవుతాయి.













