Fauji: డార్లింగ్ మరో 30 రోజులే బ్యాలెన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ప్రభాస్ ఓ వైపు మారుతి(maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్(the raja saab( తో పాటూ హను రాఘవపూడి(hanu raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ(fauji) అనే సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. రాజా సాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తవగా, ఫౌజీ సినిమా షూటింగ్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది.
సీతారామం(sitaramam) ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ అని, ఈ సినిమాను హను చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారని అంటున్నారు. సీతారామం తర్వాత హను నుంచి వస్తున్న మరో లవ్ స్టోరీ అవడం, అందులో ప్రభాస్ నటిస్తుండటంతో ఫౌజీ సినిమాపై మంచి అంచనాలున్నాయి.
ఇదిలా ఉంటే ఫౌజీ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇప్పటికే 50% షూటింగ్ పూర్తైందని, ప్రభాస్ పాత్రకు సంబంధించి మరో 30 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, ఆ 30 రోజుల షూటింగ్ లోనే ప్రభాస్ పై ఓ భారీ యాక్షన్ సీన్ ను కూడా తీయనున్నారని, ఆ యాక్షన్ సీన్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయెల్(imanvi esmael) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.







