డార్లింగ్ సంపాదన సెకనుకు అన్నిలక్షలా..
సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ అందుకున్న హిట్ ఇదే. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ప్రతి సినిమా నిరాశనే మిగిల్చింది. దీంతో సలార్ పై ఎన్నో ఆశలు పెట్టుకోగా, ఆఖరికి ఈ సినిమా ద్వారా ప్రభాస్ కు హిట్ వరించింది. సలార్ తో ప్రభాస్ రూ.700 కోట్లు వసూలు చేశాడు.
తాజాగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజై, అక్కడా రికార్డులు సృష్టిస్తోంది. అయితే 2 గంటల 55 నిమిషాల నిడివి కలిగిన సలార్ సినిమాలో ప్రభాస్ మాట్లాడింది కేవలం 2 నిమిషాల 35 సెకన్లు మాత్రమే. దీంతో కొందరు నెటిజన్లు ప్రభాస్ డైలాగులన్నింటినీ కలిపి ఒక వీడియో చేసి డైలాగ్ టైమింగ్ తో ప్రభాస్ రెమ్యూనరేషన్ ను కంపేర్ చేస్తున్నారు.
సలార్ సినిమాకు ప్రభాస్ రూ.125 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే ప్రభాస్ సెకనుకు రూ.80,64,515 తీసుకున్నాడు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో సెకనుకు ఇంత పెద్ద మొత్తంలో ఛార్జ్ చేసిన హీరో ప్రభాస్ ఒక్కడే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ కల్కి, ది రాజా సాబ్ సినిమాలు చేస్తున్నాడు.













