ప్రభాస్తో లోకేష్ మూవీ.. ఇప్పట్లో లేనట్లే!
విక్రమ్ సినిమాతో ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం విజయ్ హీరోగా లియో సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్ ఇంటర్వ్యూలిస్తున్నాడు. ఇందులో భాగంగా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తానని హింట్ ఇచ్చాడు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ లాంటి హీరోకు లోకేష్ ఏ రేంజ్ ఎలివేషన్లు ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరి కాంబోలో సినిమా ఉన్నప్పటికీ అది సెట్స్ పైకి వెళ్లడానికి చాలా ఏళ్లు పట్టే అవకాశముంది.
ప్రస్తుతం లియో రిలీజ్ వర్స్క్ లో బిజీగా ఉన్న లోకేష్ తర్వాత రజినీ171 చేయాల్సి ఉంది. అది పూర్తయ్యే సరికి 2024 అయిపోతుంది. ఆ తర్వాత కార్తీతో ఖైదీ2 తీస్తానని చెప్తున్నాడు. ఈ లోపు విక్రమ్2 కు అన్నీ సెట్ అవుతాయి కాబట్టి అది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సూర్యతో అనౌన్స్ చేసిన రోలెక్స్ సినిమా చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తవ్వాలంటే 2028 వచ్చేస్తుంది.
మరోవైపు ప్రభాస్ కూడా బిజీగానే ఉన్నాడు. సలార్ తర్వాత ప్రభాస్ కల్కి, కల్కి2, సలార్2, మారుతి మూవీ, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలున్నాయి. ఇవన్నీ పూర్తి కావాలంటే కూడా చాలానే టైమ్ పడుతుంది. కాబట్టి వీరిద్దరి ప్రాజెక్ట్ ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప లోకేష్-ప్రభాస్ కాంబోలో సినిమా 2028 కు ముందు వచ్చే ఛాన్సే లేదు.













