కల్కి ఈసారైనా చెప్పిన టైమ్ కు వస్తుందా?
అనుకున్నట్టు గానే కల్కి 2898ఎడి మే 9న రిలీజ్ కావడానికి డేట్ ను లాక్ చేసుకుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి సినిమాలు కూడా అదే రోజున రిలీజ్ అయి మంచి హిట్లవడంతో ఇప్పుడా డేట్‌ను సెంటిమెంట్‌ను భావిస్తోంది వైజయంతి బ్యానర్. ఈ రిలీజ్ డేట్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.
కానీ చెప్పినట్టుగానే మేకర్స్ ఆ రిలీజ్ డేట్‌కు కట్టుబడి ఉంటారా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇప్పటికే జనవరి నుంచి వాయిదా పడి మే నెలకు వాయిదా పడ్డ కల్కి, ఈసారైనా చెప్పిన డేట్ కు వస్తుందా అని అభిమానులు అనుమాన పడుతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఇంటర్నేషనల్ లో రేంజ్ లో ప్రమోట్ చేసేందుకు మేకర్స్ ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు.
రాబోయే రోజుల్లో కల్కి టీమ్ నుంచి మరిన్ని ఇన్నోవేటివ్ ఐడియాలు చూడనున్నారట. ఇవాళ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ లో ప్రభాస్ సూపర్ హీరో గెటప్ లో కనిపించి సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశాడు. ఊహించని ఫాంటసీ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోన్న కల్కిలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













