తొమ్మిది భాగాలుగా కల్కి?
సలార్ సినిమాతో మంచి హిట్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శక్వంలో కల్కి 2898ఏడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా పలువురు స్టార్లు నటిస్తున్నారు.
వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని ఇప్పటికే చాలా వార్తలొచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. సెకండ్ పార్ట్ కు లీడ్ ఇస్తూ కల్కి మొదటి భాగం ముగుస్తుందని చాలా మంది అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త వైరల్ అవుతుంది.
టాలీవుడ్ కమెడియన్ అభినవ్ గోమఠం రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కల్కి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా తొమ్మిది పార్టులుగా రానుందని అన్నాడు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ ను కల్కి సినిమా కూడా ఫాలో అవుతుందని అభినవ్ చెప్పాడు. అయితే ఈ వార్త కచ్ఛితంగా నిజమో కాదో తనకు తెలియదని, తాను కూడా ఎక్కడో విన్నట్లుగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు తాను ప్రభాస్ కు చాలా పెద్ద ఫ్యాన్ ని అని చెప్పిన అభినవ్, ఎలాగైనా ప్రభాస్ ను కలుసుకోవాలనుందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇదే నిజమైతే నాగ్ అశ్విన్ కల్కి పేరుతో మరో ప్రపంచాన్ని సృష్టించినట్లే అని చెప్పాలి.













