Fauji: మళ్లీ ఆ లుక్ లో ప్రభాస్?

ప్రభాస్(Prabhas) చేతిలో ప్రస్తుతం పలు ప్రాజెక్టులుండగా, ది రాజా సాబ్(the raja saab), ఫౌజీ(Fauji) సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మారుతి(Maruthi) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) చేస్తున్న ది రాజా సాబ్ రీసెంట్ గానే టీజర్ తో మంచి రెస్పాన్స్ ను అందుకుని సినిమాపై ఉన్న అంచనాలను పెంచుకుంది. హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతున్న రాజా సాబ్ ను రిలీజ్ కు రెడీ చేస్తున్న ప్రభాస్ మరోవైపు హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఫౌజీ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి లుక్స్ లో కనిపిస్తాడా అని చూడ్డానికి డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఫౌజి సెట్స్ లోని ప్రభాస్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట లీకవగా, ఆ ఫోటోల్లో ప్రభాస్ మిర్చి(Mirchi) సినిమా లుక్స్ లో కనిపించాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
మిర్చి సినిమాలో ప్రభాస్ తన కెరీర్లోనే బెస్ట్ లుక్స్ లో కనిపించాడు. ఆ సినిమాలో కనిపించినట్టు ప్రభాస్ మరే సినిమాలోనూ కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత హను, ప్రభాస్ ను అలా చూపించబోతున్నాడంటే ఫ్యాన్స్ కు కన్నుల పండగే అని చెప్పాలి. విశాల్ చంద్రశేఖర్(Vishal Chandra sekhar) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయెల్(Imanvi esmael) హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) భారీ బడ్జెట్ తో ఫౌజీని నిర్మిస్తోంది.