బర్త్ డే అప్డేట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ డిజప్పాయింట్
ప్రభాస్(Prabhas) బర్త్ డే కు ఈసారి అప్డేట్స్ తో మోత మోగిపోవడం ఖాయమని ఎంతో ముందునుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఓ వైపు పాత సినిమాల రీరిలీజ్‌లు, మరోవైపు కొత్త సినిమాల అనౌన్స్మెంట్ తో నిజంగానే పండగ చేసుకోవచ్చనుకున్నారు. కానీ తీరా ప్రభాస్ బర్త్‌డేకు ఫ్యాన్స్ ఊహించిన అప్డేట్స్ మాత్రం ఏవీ రాలేదు.
రాజా సాబ్(The Raja Saab) సినిమా నుంచి టీజర్ వస్తుందని ఫ్యాన్స్ ఎంతగానో ఆశపడ్డారు. చిత్ర యూనిట్ కూడా టీజర్ ట్రీట్ ఇవ్వనున్నట్లే సిగ్నల్ ఇచ్చింది. కానీ మోషన్ పోస్టర్ తోనే సరిపెట్టేశారు. రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది కానీ ఫ్యాన్స్ ఆశించింది మాత్రం రాలేదు. ఇక హను రాఘవపూడి(Hanu Ragavapudi)- ప్రభాస్ సినిమా నుంచి ఏదైనా పోస్టర్ వస్తుందేమో అనుకున్న ఫ్యాన్స్ కు బర్త్ డే విషెస్ తప్ప ఏమీ రాలేదు.
స్పిరిట్(Spirit) అప్డేట్ వస్తుందనుకుంటే గతేడాది రెడ్ కలర్ లో విషెస్ పోస్టర్ డిజైన్ చేసిన టీమ్ ఈసారి వైట్ కలర్ బ్యాక్ డ్రాప్ లో అదే పోస్టర్ ను రిలీజ్ చేశారని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇవి కాకుండా సలార్2(Salaar2), కల్కి2(Kalki2) సినిమాల నుంచి కూడా ఎలాంటి సౌండ్ లేదు. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ ను ఈ బర్త్ డే చాలా డిజప్పాయింట్ చేసిందనే చెప్పాలి.













