యూఎస్ లో బిజీగా ప్రభాస్
బాహుబలి చిత్రంతో మంచి సక్సెస్ టేస్ట్ చూసిన ప్రభాస్ వెకేషన్ కి యూఎస్ వెళ్ళాడు. దాదాపు నెల రోజుల బ్రేక్ తీసుకున్న ఈ హీరో జూన్ 5న హైదరాబాద్ కి రానున్నాడట. ఇక రెండు మూడు రోజుల గ్యాప్ తీసుకొని సాహో టీంతో కలవనున్నాడని సమాచారం. ఇప్పటికే సాహో చిత్రం పూర్తి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. రన్ రాజా రన్ ఫేం సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, యువి క్రియేషన్స్ బేనర్ పై 150 కోట్లతో సాహో రూపొందనుంది. డార్లింగ్ తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తుండగా, ఆ మధ్య విడుదలైన సాహో టీజర్ మూవీపై భారీ అంచనాలు పెంచింది. చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారు అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది.













