ఎవరూ టచ్ చేయని పాయింట్ తో ‘సుందరి’
పూర్ణ ప్రధాన పాత్రలో కళ్యాణ్ జి.గోగణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సుందరి. ఆసక్తికరమైన బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రిజ్వాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రకు పూర్ణ సెట్ అవుతుందని ఆమెను తీసుకున్నాం. ప్రేమ, పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందనే దానిపై చాలా సినిమాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎవరూ టచ్ చేయ ని పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాము. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చూడదగిన సినిమా ఇది. ఎక్కడా బోల్డ్నెస్ ఉండదు. డైరెక్టర్ నాకు చెప్పిన సూపర్ మచ్చి విడుదలకు సిద్ధమైంది. దానిని ఈ నెలలోనే విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. ఇంకా సప్తగిరితో ఓ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది అని అన్నారు.













