పూర్ణకు నెగిటివ్ రోల్స్ క్యూ కట్టడం ఖాయమే..
అందంతో పాటూ చక్కని అభినయంతో ఆకట్టుకున్న నటి పూర్ణ, అల్లరి రవిబాబు కాంపౌండ్ లో వరుస సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. అవును, అవును2 లో నటించిన పూర్ణ ఆ తర్వాత కూడా రవిబాబు తో కలిసి పని చేసింది. నరేష్ సరసన సీమ టపాకాయ్ చిత్రంలో కూడా నటించింది. కెరీర్ పరంగా ఆశించన ఛాన్స్ లు రాకపోవడంతో బుల్లితెర జడ్జిగా కూడా అవకాశాలు అందుకుని డ్యాన్స్ రియాలిటీ షో లో జడ్జిగా కొనసాగింది.
ఈ వారం రిలీజ్ అయిన పవర్ ప్లే సినిమాలో విలన్ గా కనిపించింది పూర్ణ. సినిమా కంటెంట్ గురించి పక్కన పెడితే పూర్ణకు మాత్రం ఈ సినిమాతో విలన్ గా మంచి మార్కులే పడ్డాయి. ఇక నుంచి పూర్ణకి కొత్త ఆఫర్స్ రావడం కూడా ఖాయంగా తెలుస్తుంది. కేవలం నెగిటివ్ రోల్ చేయడం మాత్రమే కాదు ఎరాటిక్ సీన్స్ లో కూడా పూర్ణ అభినయం ఆకట్టుకుంది. దీంతో ఈ టైప్ క్యారెక్టర్లు చేయమని పూర్ణని అడుగుతున్నారట. పూర్ణ బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత నెగిటివ్ రోల్స్ వరుసగా పూర్ణ వెంట క్యూ కడతాయనిపిస్తుంది.













