Pooja Hegde: రాహు కేతు పూజలో పాల్గొన్న బుట్టబొమ్మ
వరుణ్ తేజ్(Varun Tej) తో కలిసి ముకుంద(Mukunda) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే(Pooja Hegde) ఆ సినిమా తర్వాత తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో స్టార్ నటిగా ఎదిగింది. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండే పూజా హెగ్డే తర్వాత బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని వెళ్లింది. కానీ అక్కడ అమ్మడికి నిరాశే ఎదురైంది. ఈ లోగా ఇక్కడ టాలీవుడ్ లో వేరే హీరోయిన్లు పూజా ప్లేస్ ను రీప్లేస్ చేశారు.
ఫలితంగా రెండేళ్ల నుంచి పూజా సినిమా తెలుగులో ఒక్కటి కూడా రాలేదు. ప్రస్తుతం పూజా చేతిలో తెలుగు సినిమాలు కూడా ఏమీ లేవు. దీంతో ఇప్పుడు ఎలాగైనా పూజా సౌత్ లో బిజీ అవాలని చూస్తోంది. అందుకే సూర్య(Surya)తో రెట్రో(Retro) సినిమా చేస్తూనే రజినీకాంత్(Rajinikanth) కూలీ(Coolie) లో స్పెషల్ సాంగ్ కు కూడా ఒప్పుకుంది. మరోవైపు లారెన్స్(Lawrence) దర్శకత్వంలో వచ్చే కాంచన4(Kanchana4)లో కూడా పూజా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.
తిరిగి సౌత్ లో సినిమా అవకాశాలు అందుకోవడానికి తనకున్న దోషాలన్నింటినీ పోగొట్టుకునే ప్రయత్నం చేస్తోంది పూజా. అందుకోసమే శ్రీకాళహస్తి(Srikalahasti) వెళ్లి అక్కడ రాహుకేతు పూజల్లో పాల్గొంది పూజా. ఫ్యామిలీతో సహా పూజా ఇందులో పాల్గొంది. పూజలు అనంతరం దేవుడిని దర్శించుకున్న పూజాకు వేద పండితులు ఆశీర్వచనాలతో పాటూ తీర్థ ప్రసాదాలు అందించారు. మరి ఈ పూజలతో అయినా అమ్మడు మళ్లీ సౌత్ లో బిజీగా మారుతుందేమో చూడాలి. ప్రస్తుతం పూజా హెగ్డే శ్రీకాళహస్తి లో చేయించుకున్న పూజకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.













