Pooja Hegde: పూజాకి ఇదే ఆఖరి ఛాన్స్?
టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే(Pooja Hegde) తెలుగులోని అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. ప్రభాస్(Prabhas) నుంచి అఖిల్(Akhil) వరకు అందరితో నటించి తన సత్తా చాటుకున్న పూజా కెరీర్లో అనూహ్యంగా డౌన్ ఫాల్ మొదలైంది. కొన్ని ఛాన్సులు వచ్చినట్టే వచ్చి ముఖం చాటేశాయి.
కోలీవుడ్ అగ్ర హీరోలు ఛాన్సులిచ్చినా కానీ సరైన రితిలో విజయం దక్కక రేసులో వెనుకబడిపోయింది. ప్రస్తుతం పూజా బాలీవుడ్ లో మాత్రమే నటిస్తుంది. అక్కడ కూడా తన చేతిలో ఎక్కువ సినిమాలేమీ లేవు. రోషన్ ఆండ్రూస్(Roshan Andrews) డైరెక్షన్ లో షాహిద్ కపూర్(Shahid Kapoor) సరసన హీరోయిన్ గా నటిస్తోంది పూజా హెగ్డే. చూస్తుంటే ఆ సినిమా కూడా తనకు పెద్దగా కలిసిరాదని అర్థమవుతుంది.
షాహిద్ గెటప్, డ్యాన్సులు, యాక్షన్, మాసిజం ప్రతీదీ విజువల్ గా హైలైట్ అవడంతో పూజా అంతగా హైలైట్ అవడం లేదు. ఇదంతా చూస్తుంటే ఈసారి కూడా తనకు గుర్తింపు దక్కడం ఈసారి కూడా కష్టమేనని తేలిపోయింది. రీసెంట్ గా వచ్చిన భాసద్ మచ్చా అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇందులో షాహిద్ ఎనర్జిటిక్ స్టెప్పుల ముందు ఇంకేమీ నిలబడలేదు. అతడు బేసిక్ గానే చాలా గొప్ప డ్యాన్సర్ కావడంతో మిగిలిందేదీ హైలైట్ అవలేదు. ఏదేమైనా దేవా హిట్ అయితే అది పూజాకి మరో ఛాన్స్ ఇస్తుది లేదంటే బాలీవుడ్ లో కూడా పూజాకి ఇదే ఆఖరి ఛాన్స్ అని భావించాల్సి ఉంటుంది.













