Pooja Hegde: హీరోయిన్ల పేరు కూడా పోస్టర్లపై వేయరు
మొన్నటివరకు సౌత్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే(Pooja Hegde) గత కొంత కాలంగా ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు. ఒకప్పుడు అన్ని భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా చేతిలో ఇప్పుడు అనుకున్నన్ని సినిమాలు లేవు. రాధే శ్యామ్(Radhe Shyam) తర్వాత వరుస ఫ్లాపులు పూజాకి అవకాశాల్ని తగ్గించాయి.
దీంతో ఇప్పుడు స్క్రిప్ట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి సినిమాలను ఒప్పుకుంటుంది బుట్టబొమ్మ. ప్రస్తుతం తమిళంలో సూర్య(Surya) సరసన రెట్రో(Retro) చేస్తున్న పూజా ఈ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకుంది. ఇటీవల పూజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఎప్పుడైనా తోటి నటుల వల్ల ఇబ్బంది పడ్డారా అనే ప్రశ్నకు పూజా రీసెంట్ గా ఆన్సర్ ఇచ్చింది.
అన్నీ ఇండస్ట్రీల్లోనూ ఇబ్బంది ఉంటుందని, కాకపోతే అది ఒక్కో చోట ఒక్కోలా ఉంటుందని, షూటింగ్ స్పాట్ లో హీరో కారావాన్ సెట్స్ పక్కనే ఉంటే హీరోయిన్ల కారావాన్ మాత్రం దూరంగా పెడతారని, ఒక్కోసారి భారీ కాస్ట్యూమ్స్ ధరించి అంత దూరం నడవాల్సి వస్తుందని అలాంటప్పుడు ఎంతో ఇబ్బందిగా ఉంటుందని చెప్పిన పూజా, ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం ఎక్కువని తెలిపింది. పోస్టర్లలో హీరోల పేరు మాత్రమే ఉంటుందని, హీరోయిన్ల పేరు ఎప్పుడూ వేయరని చెప్పుకొచ్చింది.













