Pooja Hegde: DQ41 కోసం పూజా ఎంత తీసుకుంటుందంటే?

కొన్నేళ్ల పాటూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది బుట్టబొమ్మ పూజా హెగ్డే(pooja hegde). కానీ కొంత కాలంగా పూజాకు తెలుగులో అవకాశాలు బాగా తగ్గాయి. మిగిలిన భాషల్లో అప్పుడప్పుడు అవకాశాలొచ్చాయి కానీ తెలుగులో మాత్రం చేతి వరకు వచ్చిన ప్రాజెక్టులు కూడా కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళ్లాయి. సరిగ్గా అలాంటి సమయంలోనే పూజాకు తెలుగులో ఓ ఛాన్స్ వచ్చింది.
దుల్కర్ సల్మాన్(dulquer salman) హీరోగా తెలుగులో వస్తున్న ఓ సినిమాలో పూజా హీరోయిన్ గా ఎంపికైంది. దుల్కర్ కెరీర్లో 41(DQ41)వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ జరుపుకుంటుండగా, రీసెంట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరును రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సినిమాకు పూజా రెమ్యూనరేషన్ తెలిస్తే ఎవరైనా షాకవక మానరు.
గత కొన్నాళ్లుగా తెలుగులో ఏ సినిమా చేయలేదు కాబట్టి పూజా ఈ సినిమాకు తక్కువే ఛార్జ్ చేస్తుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. DQ41 కోసం పూజా ఏకంగా రూ.3 కోట్లు తీసుకుంటుందని సమాచారం. పూజా పాపులారిటీ, క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవడం వల్లే మేకర్స్ కూడా ఆ స్థాయి పారితోషికం ఇవ్వడానికి రెడీ అయ్యారట. రవి నేలకుడిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పూజా చాలానే ఆశలు పెట్టుకుంది.