Pooja Hegde: ప్రేమ కథతో బుట్టబొమ్మ రీఎంట్రీ
రెండేళ్ల ముందు వరకు తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసిన పూజా హెగ్డే(Pooja Hegde) ఆచార్య(Acharya) సినిమా తర్వాత తెలుగులో కనిపించింది లేదు. గుంటూరు కారం(Guntur Karam) సినిమాలో హీరోయిన్ గా సైన్ చేసింది కొంత భాగం షూటింగ్ కూడా చేసింది కానీ తర్వాత డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ సినిమాను వదులుకుంది. గత రెండేళ్లుగా తెలుగు తెరకు, ఆడియన్స్ కు దూరంగా ఉన్న పూజా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తెలుగు సినిమాలు చేయకపోవడానికి గల కారణాల్ని వివరించింది.
గతంలో తాను తెలుగులో వరుసపెట్టి సినిమాలు చేశానని, దాని వల్ల తనకు వరుస ఫ్లాపులు ఎదురయ్యాయని, అందుకే ఇకపై మంచి కథలు, కొత్తగా ఉండే పాత్రలు ఉంటే తప్ప సినిమాలు చేయకూడదని డిసైడయ్యానని, ఆడియన్స్ కు కొత్త పూజా హెగ్డేని పరిచయం చేయాలనుకున్నానని, ఈ క్రమంలో తన వద్దకు వచ్చిన కథలేవీ తనను ఎగ్జయిట్ చేయలేదని అందుకే గ్యాప్ వచ్చిందని వెల్లడించింది పూజా హెగ్డే.
అయితే రీసెంట్ గానే తాను తెలుగులో ఒక సినిమాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని పూజా ఈ సందర్భంగా తెలిపింది. త్వరలోనే తెలుగులో తాను ఓ ప్రేమ కథలో నటించబోతున్నానని, దీనికి మించి ఏ విషయాలను ఇప్పుడే చెప్పలేనని, మేకర్స్ అనౌన్స్ చేశాక మిగిలిన వివరాలు తెలుస్తాయని పూజా చెప్పింది. మొత్తానికి రెండేళ్ల తర్వాత పూజా తెలుగులో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు.













