Pooja Hegde: పూజా ఆశలన్నీ దానిపైనే!
ముకుంద(Mukunda) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన పూజా హెగ్డే(Pooja Hegde), ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)తో చేసిన డీజే (DJ) సినిమాతో బాగా ఫేమస్ అయింది. డీజే తర్వాత పూజాకు అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో తక్కువ టైమ్ లోనే పూజా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. సౌత్ లోని అగ్ర హీరోలందరితో నటించిన పూజాను తెలుగు ప్రేక్షకులు ముద్దుగా బుట్టబొమ్మ అని పిలుచుకుంటుంటారు.
గత కొంత కాలంగా సౌత్ లో కనిపించని పూజా హెగ్డే ఇప్పుడు రెట్రో(Retro) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. మే 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. సూర్య(Suriya) హీరోగా కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా సూర్యకు భార్య పాత్రలో నటించింది. రెట్రో లో పూజా లుక్ దగ్గర్నుంచి అన్నీ కొత్తగా ఉన్నాయి. ఈ సినిమాపై పూజా ఎన్నో ఆశలు పెట్టుకుంది.
తెలుగులో ఓ ప్రేమ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్తున్న పూజా హెగ్డే, తెలుగు ఆడియన్స్ తనను ఎంతగానో ఆదరించారని, హైదరాబాద్‌ను తాను సొంతింటిలా భావిస్తానని, అవకాశమొస్తే శ్రీదేవి(Sridevi) బయోపిక్ లో నటిస్తానని తన మనసులోని కోరికను బయటపెట్టింది పూజా. మొత్తానికి రెండేళ్ల తర్వాత పూజా తెలుగులో ఓ ప్రాజెక్టుకు సైన్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.













