ఆఫర్లిస్తున్న పూజా హెగ్డే
గతేడాది ఈ టైమ్ కు పూజా హెగ్డే చాలా బిజీగా ఉంది. అప్పటివరకు టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ గా ఉన్న పూజా చూస్తూ చూస్తూనే ఖాళీ అయిపోయింది. వరుసగా తన సినిమాలు ఫ్లాప్ అవడం, గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాల నుంచి ఆమె తప్పుకోవడంతో కథంతా తిరగబడింది. వచ్చే కొత్త అవకాశాలు ఆగిపోయాయి.
సడెన్ గా పూజా కెరీర్ డల్ అయిపోయింది. ప్రస్తుతం పూజా చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. దీంతో పూజా తెలుగు సినిమాలను లైట్ తీసుకుని బాలీవుడ్ లో బిజీ అవ్వాలని చూసింది. కానీ అక్కడ కూడా ఆమె కెరీర్ ఏమీ ఆశాజనకంగా లేదు. దీంతో పూజా ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
తన కెరీర్లో ఎప్పుడూ లేనట్లు డిస్కౌంట్ కూడా ఇస్తుందట. ఇంతకుముందు రూ.3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న పూజా ఇప్పుడు అందులో సగానికే సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు మిడ్ రేంజ్ సినిమాలు చేయడానికి కూడా పూజా రెడీగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ డిస్కౌంట్ బేరాలు పూజాకు ఎలాంటి ఆఫర్లు తెచ్చిపెడతాయో చూడాలి.













