Pooja Hegde: రెట్రోలో అవకాశమెలా వచ్చిందో చెప్పిన పూజా
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే(Pooja Hegde) గత కొంత కాలంగా వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతోంది. రీసెంట్ గా బాలీవుడ్ సినిమా దేవా(Deva)తో ప్రేక్షకుల్ని పలకరించిన పూజా ఆ సినిమాతో మరో డిజాస్టర్ ను అందుకుంది. ఇదిలా ఉంటే పూజా ప్రస్తుతం కోలీవుడ్ హీరో సూర్య(Suriya) సరసన రెట్రో(retro) సినిమాలో అవకాశం దక్కించుకున్నసంగతి తెలిసిందే.
సౌత్ లో అవకాశాలు లేని టైమ్ లో వచ్చిన ఈ సినిమాను ఛాన్స్ ను గట్టిగా వాడుకోవాలని పూజా రెట్రో కోసం చాలా కష్టపడుతుంది. ఇంకా రకంగా చెప్పాలంటే ఇలాంటి టైమ్ లో సూర్య సరసన అవకాశం అందుకోవడమంటే పూజా అదృష్టమనే చెప్పాలి. అయితే ఈ అదృష్టం తనకెలా వచ్చిందో పూజా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
రెట్రోలో తనకు ఛాన్స్ రావడం గురించి పూజా మాట్లాడుతూ ఈ ఛాన్స్ రావడానికి రాధే శ్యామ్(radhe Shyam) సినిమానే కారణమని చెప్పింది. ఆ సినిమాలో తన ఎమోషనల్ సీన్స్ చూసి డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్(karthik Subbaraj) రెట్రో కోసం తనను సెలెక్ట్ చేశారని తెలిపింది. రెట్రోలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, ఇందులో కూడా చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని పూజా ఈ సందర్భంగా వెల్లడించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమాతో అయినా పూజా హిట్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.













