రోజంతా దాంతోనే గడిపేస్తోంది!
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో పూజా హెగ్డే ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో హాయిగా గడుపుతోంది. అయితే ఈ బ్యూటీ ఇంట్లో ఖాళీగా ఉండడం లేదు. పూజా హెగ్డే పాటలు పాడటం అంటే ఇష్టం. సంగీతమంటే చాలా ఇష్టం. దీంతో గిటార్ నేర్చుకోవాలని ఆమె నిర్ణయించుకుందట. నిజానికి ఎప్పటినుంచో గిటార్ మీద మోజు ఉన్న ఇప్పుడు సమయం దొరకడంతో రోజంతా దాంతోనే గడిపేస్తోందట. ఇక లాక్ డౌన్ పూర్తయ్యే లోపు గిటార్ నేర్చుకొని సత్తా చాటేయాలనుకుంటోంది పూజా హెగ్డే. అన్నట్టు ఈ బ్యూటీ తయారు చేస్తోన్న ఫుడ్ ఐటమ్స్, చేస్తున్న యోగాసనాలు ఇప్పటికే సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. కరోనా ఓ పక్క భయపెడుతున్నా పూజా హెగ్డే కూల్ పోస్ట్లు అభిమానులకి బోలెడంత కిక్ నిస్తున్నాయి.













