ఆఫర్లు లేకపోయినా పూజా డిమాండ్స్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల నుంచి సత్తా చాటుతున్న పూజా హెగ్డే సడెన్ గా ఖాళీ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకున్న పూజా చేతిలో ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. నిన్న మొన్నటి వరకు పూజా కావాలని ఆమె వెంట పడ్డ దర్శకనిర్మాతలు ఇప్పుడు ఆమెను కాదని వేరే వారి కోసం చూస్తున్నారు.
అయితే పూజా ఇప్పటికే స్టార్ రేంజ్ అందుకుంది. కాబట్టి ఆ రేంజ్ కు తగ్గ పాత్రలు చేయడానికే ఒప్పుకుంటుంది. అందుకే పూజాకు ఆఫర్లు రావడానికి టైమ్ పడుతుందని తెలుస్తోంది. లేటెస్ట్ గా పూజాకు ఓ ఆఫర్ రాగా దానికి పూజా నో చెప్పినట్లు తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి సోలో సినిమాలే చేస్తూ వచ్చిన పూజా ఇప్పుడు కూడా సోలో హీరోయిన్ గా చేయాలనుకుంటుందట.
అందుకే రీసెంట్ గా సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వస్తే చేయనని నిర్మొహమాటంగా చెప్పిందట. అసలు సినిమాలే లేని టైమ్ లో ఏదో ఆఫర్ వచ్చింది కదా అని చేయకుండా పూజా మంచి క్రెడిబిలిటీని మెయిన్టెయిన్ చేస్తుంది. అంతేకాదు కావాలంటే రెమ్యూనరేషన్ విషయంలో కాస్త తగ్గించనైనా తగ్గిస్తా కానీ సోలో హీరోయిన్ గానే చేస్తానంటుంది. అలా కాదు ఇద్దరు హీరోయిన్స్ అవసరం సినిమాలో ఉంటే మెయిన్ హీరోయిన్ గా మాత్రం ఆమెనే తీసుకోవాలని చెప్తుందట. మరి పూజా కోరుకుంటున్న ఆ ఛాన్స్ ఎప్పుడు తనకు దక్కుతుందో చూడాలి.













