పొలిటీషియన్‌కు త్రిష నోటీసులు
రెండు నెలల కిందట సీనియర్ హీరోయిన్ త్రిషపై నటుడు మన్సుర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపాయో అందరికీ తెలుసు. లియోలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశించి, ఆ సీన్ లేకపోవడంతో నిరాశ చెందానని మన్సుర్ చేసిన వ్యాఖ్యలపై అందరూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయంలో త్రిష, మన్సుర్కు వార్నింగ్ ఇచ్చి అంతటితో విషయాన్ని వదిలేసింది.
ఇప్పుడు మరోసారి త్రిష ప్రమేయం లేకుండా ఆమె పేరు చర్చనీయాంశంగా మారింది. రాజు అనే అన్నాడీఎంకే నేత త్రిష గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. తనకు తెలిసిన ఓ వ్యక్తి త్రిషతో గడిపాడని, దానికి గాను త్రిష రూ.25 లక్షలు తీసుకుందని కామెంట్స్ చేశాడు. ఈ విషయాన్ని ఊరికే వదిలేయకూడదని భావించిన త్రిష ఆయనకు లీగల్ నోటీస్ పంపింది.
ఏదైనా పత్రిక ద్వారా రాజు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటూ పరువు నష్టం కింద కొంత పరిహారం చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొంది. తన మీద ఒక్కసారిగా అందరూ ఫైర్ అవడంతో తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని స్టేట్మెంట్ ఇచ్చాడు. త్రిష ఓ సెటిల్మెంట్ లో భాగంగా రూ.25 లక్షలు తీసుకుందని చెప్పడం తన ఉద్దేశమన్నాడు. త్రిషతో పాటూ తాను ఆ సందర్భంగా ప్రస్తావించిన అతనికి కూడా రాజు క్షమాపణ చెప్పాడు. మరి త్రిష ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తుందా లేక నోటీసుల్లో చెప్పినట్లు చేసేవరకు పట్టుబడుతుందో చూడాలి.













